Quthbullapur: తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తె.. కుమారులున్నా తలకొరివి పెట్టిన కూతురు!

Quthbullapur: కన్న కొడుకులు ఉన్నప్పటికీ తండ్రి ఆఖరి కోరిక మేరకు కుమార్తె శ్రీదేవి తలకొరివి పెట్టి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు పూర్తి చేసిన ఘటన దుండిగల్‌లో చోటుచేసుకుంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 11 Oct 2026 7:20 PM IST
Quthbullapur
X

Quthbullapur: తండ్రి కోరిక నెరవేర్చిన కుమార్తె.. కుమారులున్నా తలకొరివి పెట్టిన కూతురు!

కుత్బుల్లాపూర్: కన్న కొడుకులు ఉన్నప్పటికీ తండ్రి కోరిక మేరకు ఆయన దహన సంస్కారాలను కుమార్తె పూనుకొని శాస్త్తోక్తంగా నిర్వహించింది. తండ్రీకూతుళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని తార్కాణంగా నిలిచిన ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ లో చోటుచేసుకుంది.

దుండిగల్ లో నివసించే వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కుమార్తె మీద అమితమైన ప్రేమ ఉన్న వెంకటేశ్వరరావు తన అవసానదశలో కుమార్తె వద్దే కాలం వెళ్ళదీయాలని నిర్ణయించుకున్నారు.

అంతే కాకుండా తాను చనిపోతే తనకు తలకొరివి కుమార్తె శ్రీదేవే పెట్టాలని వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులకు స్పష్టం చేశారు. అయితే వృద్ధాప్య కారణాలతో శనివారం వెంకటేశ్వరరావు మృతిచెందారు. ఆదివారం చివరి చూపుకు కమారులిద్దరూ వచ్చి తండ్రి పార్థివదేహాన్ని చూసి వెళ్ళిపోయారు. వెంకటేశ్వరరావు కోరిక మేరకు కుమార్తె శ్రీదేవి అన్నీతానై తండ్రికి తలకొరివి పెట్టి శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR