Kalwakurthy: కల్వకుర్తిలో భక్తిశ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
Kalwakurthy: కల్వకుర్తి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 37వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
Kalwakurthy: కల్వకుర్తిలో భక్తిశ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో, వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. వేకువ జామున పూజలు, రాజరాజేశ్వరి దేవి రూపంలో వాసవి మాతను అలంకరించారు. గీతా పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు.
అమ్మవారికి పల్లకి సేవ, గోమాత పూజలు చేశారు. అనంతరం సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 37 సంవత్సరాలుగా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఏ ఏటికి ఆ ఏడు ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం ఒకరిని ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా ఎంపిక చేసి కమిటీ ద్వారా ఉత్సవాలను న భూతో నా భవిష్యత్ అనే రీతిలో నిర్వహిస్తూ వస్తున్నారు.
వెయ్యి మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రి ఉత్సవాల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవాల సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని ముఖ్య కూడలలో మైక్ లు ఏర్పాటు చేసి ఆలయంలో జరిగే పూజలు ప్రజలకు తెలిసే విధంగా ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కల్మిచర్ల గోపాల్ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు, వాసవి క్లబ్, ఆవోప సభ్యులతోపాటు మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




