Hyderabad: సంవిధాన్ రక్షా మార్చ్ ఏర్పాట్లు పరిశీలించిన దానం నాగేందర్!

Hyderabad: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించే సంవిధాన్ రక్షా మార్చ్ ఏర్పాట్లను మాజీ మంత్రి దానం నాగేందర్ పరిశీలించారు.

RAJESH,	WEST ZONE
Published on: 25 Nov 2026 1:50 PM IST
Hyderabad
X

Hyderabad: సంవిధాన్ రక్షా మార్చ్ ఏర్పాట్లు పరిశీలించిన దానం నాగేందర్!

Hyderabad: రాజ్యాంగ పరిరక్షణ కోసం నిర్వహించే సంవిధాన్ రక్షా మార్చ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి దానం నాగేందర్ కోరారు. రేపు ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు జరిగే ర్యాలీ ఏర్పాట్లను ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్ కలిసి దానం పరిశీలించారు.

ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించే మార్చ్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున్న పాల్గొని విజయవంతం చేయాలని దానం కోరారు.

భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ అనేది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదని ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల హక్కులను కాపాడుకునే బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారని దానం వెల్లడించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE