Nizampet: మటన్, చికెన్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలి..సీపీఐ!
Nizampet: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని మటన్, చికెన్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టాలని నిజాంపేట్ ప్రజావాణిలో సీపీఐ నాయకుల ఫిర్యాదు.
Nizampet: మటన్, చికెన్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలి..సీపీఐ!
Nizampet: నిజాంపేట్ సర్కిల్ పరిదిలో మటన్, చికెన్ షాపులు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలనీ సీపీఐ ఆధ్వర్యంలో నిజాంపేట్ సర్కిల్ ప్రజావానిలో పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలాభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని మటన్, చికెన్ ఆదివారం మిగిలిన మాంసాన్ని ప్రైజ్ లో పెట్టి తిరిగి సోమవారం రోజు షాప్ వారు అమ్ముతున్నారు.
అని స్థానిక ప్రజలు తెలియజేశారు అని కనుక వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించి ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తాము అని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం సీపీఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నాకంటే దస్తగిరి, కాట్రగడ్డ వాసు తదితరులు పాల్గొన్నారు.




