Kushaiguda: 120 మీటర్ల యూజీడీ పనులను ప్రారంభించిన బొంతు శ్రీదేవి యాదవ్!

Kushaiguda: కుషాయిగూడ డివిజన్‌లోని రిషికా హాస్టల్ గల్లీలో కార్పొరేటర్ స్పెషల్ బడ్జెట్ నిధులతో 120 మీటర్ల యూజీడీ పనులను బొంతు శ్రీదేవి యాదవ్ ఘనంగా ప్రారంభించారు.

ASHOK, KAPRA
Published on: 14 Nov 2026 4:51 PM IST
Kushaiguda
X

Kushaiguda: 120 మీటర్ల యూజీడీ పనులను ప్రారంభించిన బొంతు శ్రీదేవి యాదవ్!

Kushaiguda: కుషాయిగూడ డివిజన్ లో కార్పొరేటర్ స్పెషల్ బడ్జెట్ నిధులతో రిషికా హాస్టల్ గల్లీలో 120 మీటర్ల యుజిడి పనులను బొంతు శ్రీదేవి యాదవ్ ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రాంతంలో చాలా కాలంగా డ్రైనేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో మురుగునీరు రోడ్లపైకి వచ్చి, దోమలు, దుర్వాసనతో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానికులు బొంతు శ్రీదేవి యాదవ్ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించి కార్పొరేటర్ స్పెషల్ బడ్జెట్ నుండి నిధులు మంజూరు చేయించి, పనులను ప్రారంభించారు.

యు జి డి పనులు పూర్తయితే ఆ గల్లీలో మురుగునీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందని, ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని, కుషాయిగూడ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వాస్తవ్యులు కాసుల పోచయ్య గౌడ్, సింగి రెడ్డి వెంకట్ రెడ్డి,శ్రీనివాస్ గుప్తా, బత్తుల శ్రీకాంత్ యాదవ్, శ్రీ చరణ్,సాకేత్ గౌడ్ చిందం బల్ నరసింహ వంశరాజ్, నేమూరి సాయికిరణ్ గౌడ్, పులి సత్యనారాయణ గౌడ్, పి మల్లేష్ గౌడ్, లింగాల సత్యనారాయణ గౌడ్, పులి రాజేష్, కూడారే ఆనంద్, బాయమ్మ, లవణం జయమ్మ, కే .పద్మ,

ఎల్ .జయమ్మ, ఏ.సునీత, పి .నవనీత, కాంగ్రెస్ నాయకులు గోపాల్ యాదవ్,సుజీత్ రెడ్డి, మైలారం బాల్ నరసింహ,హీరా లాల్ నాయక్,ఉపేందర్, మహిళ నాయకురాలు నీరజ రెడ్డి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA