Kapra: నాగార్జున నగర్ అభివృద్ధిలో రాజీలేని కృషి కొనసాగించాలి!
Kapra: నాగార్జున నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా 2వ సారి ఎన్నికైన యావపురం రవిని సీసీఎస్ అధ్యక్షుడు ఎంపల్లి పద్మా రెడ్డి సోమవారం సత్కరించారు.
Kapra: నాగార్జున నగర్ అభివృద్ధిలో రాజీలేని కృషి కొనసాగించాలి!
కాప్రా: కాప్రా సర్కిల్ కుషాయిగూడ డివిజన్ పరిధిలోని నాగార్జున నగర్ సర్వతో ముఖాభివృద్ధికి రవి ఆధ్వర్యంలో కార్యవర్గం రాజీలేని కృషిని కొనసాగించాలని కాలనీ కమిటీల సమాఖ్య సిసి అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి పేర్కొన్నారు.
నాగార్జున నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన యావపురం రవిని సోమవారం ఇందిరా నగర్ లో సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డి,వివిధ కాలనీల ప్రతినిధులు శాలువాలు కప్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, ఇందిరానగర్ చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి వెంకట నరసింహారెడ్డి, కాటేపల్లి శివారెడ్డి, వైష్ణవి ఎంక్లేవ్ అధ్యక్షులు గంప కృష్ణ, ఇందిరానగర్ మాజీ కార్యదర్శి సారా అనిల్ ముదిరాజ్, సాయి నగర్ అధ్యక్షులు సారా వినోద్ ముదిరాజ్, చల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




