Talakondapally: పడకల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. సర్పంచ్ పిలుపు!

Talakondapally: పడకల్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ చట్టాలు పాటించాలని సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి పిలుపు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 26 Nov 2026 12:46 PM IST
Talakondapally
X

Talakondapally: పడకల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. సర్పంచ్ పిలుపు!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరు గౌరవించాలని సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి విలువలను అందించిందని అన్నారు.

రాజ్యాంగం మనకు హక్కులను కల్పించడమే కాకుండా, పౌరులుగా మన బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, చట్టాలను పాటిస్తూ గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి, ఉపసర్పంచ్ రాఘవేందర్ గౌడ్, వార్డు సభ్యులు జోగు విజయకుమార్, ఎండీ వాజీద్, చౌట్టి విజయకుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు తిరుపతి గౌడ్, లక్ష్మీనారాయణ, నరసింహ, బషీర్, గౌస్, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY