Malkajgiri: ఓటర్లకు మరో అవకాశం కల్పించడంలో కాంగ్రెస్ పోరాటం సఫలం!

Malkajgiri: ఓటర్ల జాబితాలో పేర్లు నమోదుకు ఈ నెల 21 వరకు గడువు పొడిగించడం కాంగ్రెస్ పార్టీ పోరాట విజయమని మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు.

Bodike Manohar, Malkajgiri
Published on: 10 Nov 2026 4:48 PM IST
Malkajgiri
X

Malkajgiri: ఓటర్లకు మరో అవకాశం కల్పించడంలో కాంగ్రెస్ పోరాటం సఫలం!

Malkajgiri: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయిన అర్హులైన పౌరులకు మరో అవకాశం కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ పోరాటం ఫలించిందని మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విజ్ఞప్తులు, పోరాటం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించి ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు కల్పించిందని పేర్కొన్నారు.

ఆనంద్‌బాగ్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున ఢిల్లీ వరకు వెళ్లి పోరాటం చేసిందన్నారు.

మెదక్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి సుమారు 100 కార్లలో నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి చేరుకుని ఎన్నికల కమిషన్ దృష్టికి ఓటర్ల సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు. ఈ పోరాటానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అందించిన నాయకత్వం, సహకారం ఎంతో కీలకమని వివరించారు.

నివాస ప్రాంతాలు మారిన కారణంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడినవారు, ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓట్లు నమోదయ్యాయనే కారణంతో ఓటు హక్కు కోల్పోయినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. పేరు లేని వారు అవసరమైన గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పౌరుడికి ఆ హక్కు దక్కాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని లక్ష్మీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం ద్వారా లభించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, సతీష్ కుమార్, పిట్టల శ్రీనివాస్, అశోక్ రెడ్డి, రాందాస్, సంతోష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్, వినోద్ యాదవ్,

సత్యమూర్తి, పిట్టల నాగరాజు, రాఘవన్, శ్రీకాంత్ ముదిరాజ్, లక్ష్మి, ఆశా, కుట్టి శ్రీనివాస్ యాదవ్, బాబు, సత్యనారాయణ, సంపత్ రావు, కపిల్, పార్ధసారథి, బాలరాజు యాదవ్, బ్రహ్మయ్య, పరమేశ్, రాము, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

Bodike Manohar, Malkajgiri

Bodike Manohar, Malkajgiri