Nacharam: సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

Nacharam: నాచారం బాబానగర్, రామ్‌రెడ్డినగర్‌లలో జరిగే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పనులపై కాలనీవాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.

HARISH, TARNAKA
Published on: 10 Oct 2026 9:40 PM IST
Nacharam
X

Nacharam: సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

నాచారం: నాచారం డివిజన్‌లోని బాబానగర్‌, రామ్‌రెడ్డినగర్‌ ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) పనులను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉప్పల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు, నాచారం డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నూతలకంటి రాజు ఆధ్వర్యంలో ఈ పరిశీలన చేపట్టారు.

ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, కాలనీల్లో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. పనులపై బాబానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, మందుముల పరమేశ్వర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌.ఆర్‌. మోహన్‌, బండారి శ్రీకాంత్‌గౌడ్‌, సునీల్‌రెడ్డి, భద్రయ్య, షరీఫుద్దీన్‌, ఎం.డి. హనీఫ్‌, ఫసియుద్దీన్‌, బొల్లం నరేష్‌, నందులాల్‌ తదితరులతో పాటు బాబానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA