Amangal: ఆమనగల్లులో బాధితురాలికి రూ.42 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ!

Amangal: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన నేహా తబస్సుమ్‌కు మంజూరైన రూ.42 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కాంగ్రెస్ నాయకులు అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Nov 2026 7:51 AM IST
Amangal
X

Amangal: ఆమనగల్లులో బాధితురాలికి రూ.42 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ!

Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన నేహా తబస్సుమ్ కు మంజూరైన రూ.42 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శుక్రవారం అందజేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వసుపుల జంగయ్య, ఆమనగల్లు మున్సిపాలిటీ అధ్యక్షుడు శివలింగం, కేఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, మాజీ యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు శీను నాయక్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు సురేష్ నాయక్, శీను, శివ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY