Hyderabad: జగదీష్ రెడ్డిపై వేముల వీరేశం, కుంభం నిప్పులు

Hyderabad: జగదీష్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్యుత్ శాఖ, కాళేశ్వరం దోపిడీలపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ధ్వజమెత్తారు.

G. Rama Krishna, Hyderabad
Published on: 25 Oct 2026 6:43 PM IST
Hyderabad
X

Hyderabad: జగదీష్ రెడ్డిపై వేముల వీరేశం, కుంభం నిప్పులు

హైదరాబాద్: జగదీష్ రెడ్డి పిచ్చి మాటలతో తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.. జగదీష్ రెడ్డి తన మాటలతో సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నాడు.. చేసిన విధ్వంసం, నష్టాన్ని కప్పిపుచ్చుకునే ఆరాటంలో జగదీష్ రెడ్డి ఉన్నాడు.. విద్యుత్ శాఖ మంత్రిగా ఏనాడైనా సమీక్ష చేశావా..? కమీషన్లు ఏరుకునే పనిలోనే జగదీష్ రెడ్డి ఉన్నాడు.

శాఖలో ఏం జరుగుతుందో కనీస అవగాహన, జ్ఞానం లేని వ్యక్తి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లాపై ఏ మాత్రం పట్టులేని, ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాని అసమర్థ, పనికిమాలిన, పని లేని మంత్రి జగదీష్ రెడ్డి.. నల్గొండ జిల్లా ప్రజలకు శాపం జగదీష్ రెడ్డి.. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం విదేశాల నుంచి బొగ్గు దిగుమతికి ఒప్పందాలు చేసుకున్నది నిజమా కాదా..?

యాదాద్రి పవర్ ప్లాంట్ అంచనాలు పెంచింది నిజమా కాదా..? ప్రతిమా గ్రూప్‌కు యాదాద్రి పవర్ ప్లాంట్‌కు బొగ్గు దిగుమతి చేసుకునే అవకాశం ఇచ్చి, యాభై ఏళ్లకు లక్ష కోట్లు ఇచ్చే ప్రయత్నం చేసింది మీరు కాదా..? ఇన్ని పాపాలు చేసి శ్రీరామచంద్రుడిలా మాట్లాడుతున్నాడు.. జగదీష్ రెడ్డి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నాడు..

మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంటే, ఎక్కువ ధరకు ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకున్నది మీరు కాదా..? దీని వెనుక ఆంతర్యం ఏమిటి..? లోపాయికారీ ఒప్పందాలు ఏమిటి..? ఇప్పుడు మార్కెట్‌లో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నాం.. విద్యుత్ కొరత ఉన్నప్పటికీ, పంటలకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం.. 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా సరఫరా చేస్తున్నాం..

ఈ భారీ ఎత్తున విద్యుత్ డిమాండ్ ఉంటే ప్రభుత్వం ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. 14 వేల మెగావాట్లకు మించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ పంపిణీ చేయలేదు.. కొడంగల్‌కు జగదీష్ రెడ్డి వెళ్లి చూసి రావాలి.. మా ముఖ్యమంత్రి పైన కొడంగల్‌లో, కొండారెడ్డిపల్లిలో ఎంత ప్రేమ ఉందో నీకు తెలుస్తుంది.. సూర్యాపేట మున్సిపాలిటీలో జగదీష్ రెడ్డి ఎన్ని సీట్లు గెలిపించాడు..?

జగదీష్ రెడ్డి పెద్ద మేధావిని, లీడర్ అని అనుకుంటున్నాడు.. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాడా..? నల్గొండ జిల్లా రైతులకు నీళ్లు పారిస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీని జగదీష్ రెడ్డి గెలిపించలేదు..? సూర్యాపేటలో జగదీష్ రెడ్డి అత్తెసరు ఓట్లతోనే గెలిచాడు.. జగదీష్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు.. దొంగతనాలు బయటకు వస్తాయన్న భయంతోనే జగదీష్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.

ఎల్‌నినోను కూడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం అంటే మీకు ఏపాటి తెలివి ఉందో అర్థమవుతూనే ఉంది.. అప్పుల కుప్ప తెలంగాణను ప్రజలకు ఇచ్చి, ఆస్తులు మాత్రం బీఆర్ఎస్ నాయకులు సంపాదించుకున్నారు.. 2015లో యాదాద్రి పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి, 10 ఏళ్లు అయినా పూర్తి చేయలేకపోయారు.. కనీసం పర్యావరణ అనుమతులు కూడా తీసుకురాలేకపోయారు..

యాదాద్రిలో ఐదో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టింది మా ప్రభుత్వం కాదా..? యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఇసుక, కంకర, భూసేకరణ పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకున్నారు.. యాదాద్రిలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నష్టాన్ని మా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సరిచేస్తున్నారు.. తానే తెలివికల్లోడు అన్నట్లు జగదీష్ రెడ్డి వ్యవహారం ఉంది..

జగదీష్ రెడ్డి నవ్వులో, మనసులో, వెటకారంలో, అణువణువునా విషమే.. జగదీష్ రెడ్డి విషం బారిన పడి నల్గొండ జిల్లా ఒక శాపంగా మారింది.. దోచుకొని దాచుకున్నాడు తప్ప, ఒక్క లిఫ్ట్ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడు.. జగదీష్ రెడ్డి అంటే నల్గొండ జిల్లాకు గుండు సున్నా.. మా సీఎం పైన మాట్లాడటానికి జగదీష్ రెడ్డికి బుద్ధి, జ్ఞానం ఉండాలి.

యాదాద్రిని పూర్తి చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలపకుండా ప్రభుత్వంపైన అడ్డగోలుగా మాట్లాడుతున్నావా..? సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.. రైతులకు సక్రమంగా విద్యుత్ పంపిణీ చేయడానికి ఆరు ఐఏఎస్ అధికారులతో నిరంతరం సమీక్ష చేయిస్తున్నాం.. గత పదేళ్లలో రాష్ట్రాన్ని సంపూర్ణంగా భ్రష్టు పట్టించారు..

దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అసెంబ్లీకి రాకుండా పారిపోయారు.. ఉద్యమకారుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఫోజులు కొడుతున్నారు.. అహంకారంతో బతుకుతున్నారు.. మీ అహంకారాన్ని బండకేసి కొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు.. తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లో కూడా బండకేసి కొట్టారు..

అయినా అహంకార భాష పోవడం లేదు.. భవిష్యత్తులో మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు.. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి తెలంగాణ సమాజంపై నిరంతరం విషం చిమ్మే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి.. బీఆర్ఎస్ నుంచి పాఠాలు నేర్చుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు.. కాంగ్రెస్ అంటే కరెంటు.. కరెంటు అంటే కాంగ్రెస్.. ఉచిత కరెంటుకు పేటెంట్ కాంగ్రెస్..

బీఆర్ఎస్ హయాంలో కరువు లేకపోయినా రైతులకు సరిగా కరెంటు సరఫరా చేయలేదు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్ తీసి చూస్తే పారిపోయారు..

కేసీఆర్, ఆయన టీం నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు.. నిజం మాట్లాడటం వాళ్ల డీఎన్‌ఏలో లేదు.. అమరుల చితి మంటలపై చలికాచుకున్న చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది..

బీఆర్ఎస్ లాంటి పనికిమాలిన పార్టీ ప్రతిపక్షంగా ఉండటం దురదృష్టకరం.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మనుషుల్లా వ్యవహరించాలి.


G. Rama Krishna, Hyderabad

G. Rama Krishna, Hyderabad