Talakondapally: నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు మాలే రవీందర్ రెడ్డి!
Talakondapally: తలకొండపల్లి మండలం చీపునుంతలలో మృతి చెందిన బిక్షపతి కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మాలే రవీందర్ రెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
Talakondapally: నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు మాలే రవీందర్ రెడ్డి!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన చలచీమల బిక్షపతి (45) గత వారం మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలే రవీందర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన వంతు సహాయంగా రూ.1 లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
బిక్షపతి భార్య జంగమ్మకు ఈ మొత్తాన్ని అందజేస్తూ, ఇద్దరు కుమార్తెల చదువుకు ఈ డబ్బును వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా మాలే రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కష్టసమయాల్లో వారికి తోడుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ ఆశన్న, మాజీ సర్పంచ్ బండి రఘుపతి, నాయకులు ఎర్ర వెంకట్రాజు రెడ్డి, మాలే రామచంద్రారెడ్డి, రాజీవ్ రెడ్డి, పెంటయ్య, నరేష్, యాదగిరి, శివ, శ్యామ్లాల్, చెన్నకేశవులు, చెన్నయ్య, పరమేష్, వెంకటయ్య, రాజు, పార్వతాలు, జంగయ్య, రామకిష్టయ్య, రాములు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




