Hyderabad: రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం: గడ్డం వంశీకృష్ణ!

Hyderabad: రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 26 Nov 2026 7:30 PM IST
Hyderabad
X

Hyderabad: రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం: గడ్డం వంశీకృష్ణ!

హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం సాగిస్తుందని పేర్కొన్నారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని లిబర్టీ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాకా విగ్రహానికి కూడా పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 13 ఏళ్లుగా బీజేపీ రాజ్యాంగ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను అవమానించేలా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని తెలిపారు. అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ చేసిన అవమానకర వ్యాఖ్యలను పార్లమెంట్ వేదికగానే కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టిందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మధ్య విభేదాలు సృష్టించి, వారిని విభజించి పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన సమానత్వం, స్వేచ్ఛ, హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 20, 21 ద్వారా పౌరులకు కల్పించిన సమానత్వం, వివక్షకు వ్యతిరేకంగా రక్షణ, భావప్రకటనా స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటూ, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.