Kadthal: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి!
Kadthal: నవంబర్ 26న మద్దిమడుగులో భూమిపూజ, అచ్చంపేటలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని గూడూరు భాస్కర్ రెడ్డి కోరారు.
Kadthal: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి!
రంగారెడ్డి జిల్లా, కడ్తాల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 26న నిర్వహించనున్న పర్యటన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చినట్లు ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 26న మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారని తెలిపారు.
అనంతరం అచ్చంపేట వై జంక్షన్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలకు ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, గిరిజన నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నాలుగు మండలాల కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా తరలివచ్చి పార్టీ బలాన్ని చాటాలని గూడూరు భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.




