Amanagallu: ఆమనగల్లులో మృతుల కుటుంబాలను పరామర్శించిన పాపిశెట్టి రాము!
Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విటాయిపల్లి, మేడిగడ్డ గ్రామాల్లో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను నాయకులు పరామర్శించారు.
Amanagallu: ఆమనగల్లులో మృతుల కుటుంబాలను పరామర్శించిన పాపిశెట్టి రాము!
Amanagallu: మున్సిపాలిటీ పరిధిలోని విటాయిపల్లి గ్రామానికి చెందిన మద్దూరి పెంటయ్య గారు అనారోగ్యంతో మృతి చెందారు. అదేవిధంగా ఆమనగల్లు సమీపంలోని మేడిగడ్డ గ్రామానికి చెందిన వడ్తావత్ హుని గారు కూడా అనారోగ్యంతో మృతి చెందారు.
ఇద్దరి మృతి పట్ల వారి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానికులు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, వారి బాధలో భాగస్వాములమని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీను నాయక్ రమేష్ యాదవ్ రాకేష్ జంగయ్య గారు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




