Hyderabad: మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు కామన్ పాస్ అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం!
Hyderabad: మెట్రో, ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం కామన్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం. బేగంపేట నుంచి సచివాలయం వరకు మంత్రుల ప్రయాణం.
Hyderabad: మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు కామన్ పాస్ అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం!
Hyderabad: మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాసేపట్లో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ బేగంగపేట నుంచి జూబ్లీహిల్స్ వరకూ మెట్రోలో ప్రయాణించనున్నారు. అక్కడినుంచి ఆర్టీసీ బస్సులోల సచివాలయం చేరుకోనున్నారు. ప్రయాణికులతో మంత్రులు, సమస్యలు, అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 14 మంది మంత్రులకు కామన్ పాస్‌లు జారీ చేశారు. ఫస్ట్ మైల్ టూ లాస్ట్ మైల్ కనెక్టివిటిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజా రవాణాను మరింత సమగ్రంగా, సౌకర్యంగా మార్చే లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.




