Telangana: పోలీసుల తరహాలో ఎక్సైజ్‌లోనూ ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లు!

Telangana: పోలీస్ శాఖ తరహాలోనే ఎక్సైజ్ శాఖలోనూ ఆన్‌లైన్ కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ వెల్లడించారు.

Arun Goud, Hyderabad
Published on: 8 Oct 2026 7:48 PM IST
Telangana
X

Telangana: పోలీసుల తరహాలో ఎక్సైజ్‌లోనూ ఆన్‌లైన్ ఎఫ్‌ఐఆర్‌లు!

తెలంగాణ: ఎక్సైజ్ శాఖలో కూడ అన్‌లైన్‌లో ఎక్సైజ్ కేసుల నమోదు ప్రకియను ముందుకు తీసుక వెళ్లడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆబ్కారీ భవన్‌లో జరిగిన క్యూర్ డీసీలు, ఇతర అధికారులతో కమిషనర్ సమీక్షా నిర్వహించారు.

పోలీస్ శాఖ రీతిలో ఎక్సైజ్ శాఖలో కూడ అన్‌లైన్ కేసుల నమోదు ప్రకియను తీసుక రావాలని చర్యలు చేపట్టామని కమిషనర్ అన్నారు. కొత్తగా బార్ల కోసం వచ్చె వరఖాస్తులను లాటరీ పద్దతి డ్రా తీయడానికి అవసరమైన చర్యలను డీసీలు చేపట్టాలని అన్నారు.

డిఫెన్స్, మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చె మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి ఎక్సైజ్‌శాఖ దాడులను ముమ్మురం చేసి అక్రమ మద్యం రవాణను అరికట్టాలన్నారు. డ్రగ్స్, గంజాయి, నాటుసారాను పూర్తిగా లేకుండా చేయడానికి ఎక్సైజ్ శాఖ గట్టి నిఘా కట్టడి చేయాలనీ కమిషనర్ అదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) జి. అంజన్‌రావు, గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్లు ఏ.శ్రీనివాసరెడ్డి, జె.హరి కిషన్, ప్రణవీ, టీజీబీసీఎల్ డీసీ పి.దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ (హెడ్ క్వార్టర్స్) శీలం శ్రీనివాస్, డి.శ్రీనివాస్, డి.శ్రీనివాసరెడ్డి, ఈఎస్‌లు పాల్గొన్నారు.

Arun Goud, Hyderabad

Arun Goud, Hyderabad