Hyderabad: సేల్ డీడ్‌ల సమస్య పరిష్కారంపై కాలనీవాసుల హర్షం!
Hyderabad: సేల్ డీడ్‌ల సమస్య పరిష్కారంపై బిఎన్‌రెడ్డి నగర్‌లో కాలనీవాసుల సంబరాలు. కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు.
Hyderabad: సేల్ డీడ్‌ల సమస్య పరిష్కారంపై కాలనీవాసుల హర్షం!
Hyderabad: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల సమస్యకు పరిష్కారం చూపుతూ సేల్ డీడ్ లను అందజేయడంపై కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించినందుకు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్ పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాకుండా స్వీట్లు తినిపించి సంబరాలు నిర్వహించారు. ఉదయం మధుయాష్కి గౌడ్ గారు బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ లోని ఎన్జీవోస్ కాలనీ వివేకానంద పార్క్, రాజీవ్ గాంధీ పార్కులను సందర్శించారు. మార్నింగ్ వాకర్స్ తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ల సమస్యలు ఎదుర్కొంటున్న వైదేహి నగర్, బియన్ రెడ్డి నగర్ కాలనీ, శ్రీపురం తదితర కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పార్క్ వద్దకు వచ్చి మధుయాష్కి గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీనియర్ నేత ముద్దగోని రామ్మోహన్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి గారు, బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు పర్వతి గణేష్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మకుటం సదాశివుడు గార్లకు కూడా స్వీట్లు తినిపించి తమ రిజిస్ట్రేషన్ ల సమస్యకు పరిష్కారం కోసం కృషి చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
కాలనీవాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో జీవో 118 పేరుతో ఇచ్చిన డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ తో బ్యాంకు లోన్లు రాక, మార్ట్గేజ్, గిఫ్ట్ డీలు చేసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డామన్నారు. కానీ సమస్యను మధుయాష్కి గౌడ్ గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే.. న్యాయవాదిగా అతను అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి, జీవోలో లోపాలను గుర్తించి.. పరిష్కారం కోసం సీఎం గారితో పాటు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు, ఉన్నతాధికారులకు సూచనలు చేశారన్నారు. మధుయాస్కి గారి సూచనల మేరకే జీవో 118 లో మార్పులు చేసి పూర్తి యాజమాన్య హక్కులతో సేల్ డీడ్ లను అందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ స్థలాల విలువ ఒక్కసారిగా 30 శాతం పెరిగిందని వివరించారు.
ఈ సందర్బంగా మధుయాష్కిగౌడ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందజేసిన సేల్ డీడ్ లతో ప్రజల ఆస్తులకు నిజమైన హక్కు లభించడంతోపాటు వాటి విలువ ఒక్కసారిగా పెరిగిందని పేర్కొన్నారు. అపద వస్తే గతంలో సగం ధరకే విక్రయించుకునే వారని.. కానీ తమ ప్రభుత్వం సేల్ డీడ్లు అందిస్తుండడంతో రాత్రి రాత్రే గజానికి 30 వేల వరకు పెరిగిందని కాలనీవాసులు చెబుతుండడం సంతోషకరమన్నారు.
గతంలో జీవో 118 పేరుతో లోప భూయిష్టంగా ప్రజలు కష్టపడి కొనుక్కున్న ఆస్తులను భూ అక్రమ దారులుగా పేర్కొంటూ డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ ను అందజేశారని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ కు బదులుగా పూర్తి యాజమాన్య హక్కులతో కూడిన సేల్ డీడ్ ను అందిస్తుందన్నారు. ప్రజలు తమ ఆస్తులను అమ్ముకోవాలనుకున్నా, గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, మార్టిగేజ్ చేయాలనుకున్న, బ్యాంకు లోన్లకైనా ఎలాంటి ఎన్ ఓ సీ లేకుండా ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన సెల్ డీడ్ ను అందజేస్తున్నట్లు వివరించారు. రాజకీయాల కతీతంగా, ఓట్ల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సమస్య పరిష్కరించాలన్న లక్ష్యంతో రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కారం చూపినట్లు వివరించారు. అంతేకాకుండా ప్రజల ఆస్తులకు సంబంధించి ఇప్పటివరకు నిషేధిత జాబితా అయిన 22 ఏ నుంచి కూడా తొలగిస్తారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్దగొని లక్ష్మీప్రసన్న గారు, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్ గారు నేలపాటి రామారావు గారు, డివిజన్ల అధ్యక్షులు శ్రీనాథ్ గారు, రమేష్ నాయక్ గారు, సీనియర్ నాయకులు నరసింహ యాదవ్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు కొండోజు శ్రీనివాస్ గారు, దాము మహేందర్ యాదవ్ గారు, కాలనీ సంక్షేమ సంఘాల వాసులు దామోదర్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, నాయకులు సరస్వతి గారు, నందకిషోర్ గారు, శశికాంత్ గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.




