Vikarabad: ఎల్‌నినో ఎద్దడిపై కలెక్టర్ దీపక్ తివారి సమీక్ష

Vikarabad: ఎల్‌నినో దృష్ట్యా రాబోయే 8 నెలలు ప్రజలకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 31 Oct 2026 5:28 PM IST
Vikarabad
X

Vikarabad: ఎల్‌నినో ఎద్దడిపై కలెక్టర్ దీపక్ తివారి సమీక్ష

Vikarabad: రాబోయే రోజుల్లో: ఎల్ నినో వలన తీవ్ర మైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని,వచ్చే 8 నెలలు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు.

భవిష్యత్తులో కరువు పరిస్థితులు, పశు గ్రాసం , నీటి కొరత,విద్యుత్ వంటి సమస్యలు ఎదురైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలని అన్నారు.

శనివారం జిల్లా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశం లో ఎల్ నినో నేపథ్యంలో త్రాగు నీరు సరఫరా,,విద్యుత్,వి.బి.జి రామ్ జీ పనులు, సమీక్ష సమావేశంలో సమీక్షించారు.

జిల్లా అధికారులతో తాగునీటి సరఫరా, పశుగ్రాసం ,నీటి వనరుల లభ్యత, వేసవిలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,

జిల్లా లో అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాలో ఎక్కడెక్కడ తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించాలని సూచించారు.

ముఖ్యంగా తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి, అక్కడ అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిశీలించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో కూడిన కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేయాలని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాల మేరకు రాబోయే జూన్ నెల వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

ప్రతి శాఖ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడంతోపాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలుత గుర్తించేది గ్రామస్థాయి సిబ్బందేనని పేర్కొంటూ, గ్రామస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పంచాయతీ రాజ్, పశు సంవర్ధ క శాఖ, వ్యవసాయ శాఖ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీడీఓలు, మిషన్ భగీరథ, నీటిపారుదల, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో నీటి వనరుల పరిస్థితిని పరిశీలించాలని, సమస్యలు గుర్తించిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు.

అన్ని గ్రామాల్లో వి బిజీ రామ్ జి కింద పశువులకు పశు గ్రాసం పెంచాల్సిందిగా అందరి రైతులకు అవగాహనా కలిపించాలని, ప్రతి గ్రామం లో రెండు నీటి తోట్టెలు ఏర్పాటు చేయుటకు ప్రణాళిక లు సిద్ధం చేయాలనీ సూచించారు.

అవసరమైన చోట అదనపు నీటి వనరులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు, ఇతర అత్యవసర చర్యలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సూచించారు.

ప్రజలకు తాగునీటి సమస్యలు, పశువుల కు నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, అవసరమైన నిధులు, అనుమతులు, ఇతర ప్రభుత్వ సహకారాన్ని సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

ఎప్పటికప్పుడు మండల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, గ్రామాలవారీగా సమస్యలను తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శులు రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలని సూచించారు.

అవసరమైన చోట ట్యాంకర్ల సరసరా బోరుబావులు వేయడం, మోటార్లు సమకూర్చడం, పైపులైన్లు ఏర్పాటు చేయడం వంటి పనులకు ముందస్తు ప్రణాళిక రూపొందించి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు.

నీటి సమస్యగానీ, విద్యుత్ సమస్యగానీ తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు.

ఈ సందర్బంగా నాలుగు మిన్సిపాలిటీ పరిధిలో ఉన్న బోర్ వెల్స్, తాగునీటి ఎద్దడి పరిస్తితి పై సమీక్షించారు.

సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో పని చేస్తున్న జిల్లా కళాకారుల చే ప్రతి గ్రామం లో ఎలినినో పై పాటల రూపంలో ప్రజలకుమరియు రైతులకు అవగాహనా కలిపిస్తున్నట్లు కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.

గ్రామాల్లో నీటి సంరక్షణ కోసం సోక్‌పిట్లు, సామూహిక సోక్‌పిట్లు, రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తూ పనులను పర్యవేక్షించాలని తెలిపారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రాబోయే రోజుల్లో నీటి, విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా క్షేత్రస్థాయిలో రైతులకు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని అన్నారు.

అనుమతి లేకుండా చెరువుల్లో బోర్లు వేసినా, నీటిని వృథా చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్,ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుటూరు ల తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD