Medipally: ఆపదలో పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ: తుంగతుర్తి రవి!
Medipally: మేడిపల్లి విష్ణుపురి కాలనీ వాసి పర్సాపురం అరవింద్‌కు సీఎంఆర్‌ఎఫ్ చెక్కును శుక్రవారం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అందజేశారు.
Medipally: ఆపదలో పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండ: తుంగతుర్తి రవి!
మేడిపల్లి: ఆపద సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సహకారంతో బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ విష్ణుపురి కాలనీకి చెందిన పర్సాపురం అరవింద్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును తుంగతుర్తి రవి ఆయన నివాసానికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో తోడ్పాటునందిస్తుందని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




