Hyderabad: తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ సర్కార్ అండ: గజ్జెల కాంతం
Hyderabad: తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షలు, ఇల్లు ఇస్తారని టీపీసీసీ నేత గజ్జెల కాంతం తెలిపారు.
Hyderabad: తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ సర్కార్ అండ: గజ్జెల కాంతం
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ కారుడు లక్ష్మణ్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి 5లక్షలు,డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం అప్పుల పాలై లక్ష్మణ్ గౌడ్ చనిపోతే కేసీఆర్,హరీష్ రావు, కేటీఆర్ పరమర్శించ లేదు, లక్ష్మణ్ గౌడ్ ,కేసీఆర్ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమం లో కేసీఆర్ తో కలిసి పని చేశారు.
తెలంగాణ ఉద్యమ కారులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారులకు అండగా ఉంటాడు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మైన్ గా అన్ని సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళతా, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ,మీకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.
ఉద్యమ కారుల అన్ని సమస్యలు పరిస్కారం అవుతాయి,ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనవరి 5వ తేదీ ఇందిరా పార్కు దగ్గర తెలంగాణ ఉద్యమ కారులతో సభ ఏర్పాటు చేస్తాం. జనవరి 5తరవాత ఉద్యమ కారులను జేఏసీ చైర్మైన్ గా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకెళతా, ఉద్యమ కారుల అన్ని సస్యలు పరిస్కారం అయ్యేందుకు నేను కృషి చేస్తా.
2001 లో కేసీఆర్ పార్టీ పెట్టుకుండు, 2001 నుండి 2009 వరకు దొర కేసీఆర్ ను ఎవరు నమ్మలేదు, మళ్ళీ దొరల రాజ్యం వస్తే మాకు కష్టం అవుతుంది అని కేసీఆర్ ను ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీలు నమ్మలేదు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీ ని నమ్మి ప్రజలు బయటకు వచ్చారు.
తెలంగాణ రావడం లో నాలుగు కోట్ల మంది త్యాగాలు ఉన్నాయి, ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేశారు, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ దొర చేతుల్లోకి పోయింది. ఇప్పటి వరకు బలిదానం అయిన వారి ఆత్మకు శాంతి చేకూరలేదు. గల్లీ నుండి ఢిల్లీ వరకు మేము ఉద్యమం చేశాం.
తెలంగాణ కోసం నా లాంటి వారు ఎంతో మంది కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమం తో సంబందం వారు లక్షల కోట్లు సంపాదించుకున్నారు.




