Secunderabad: సికింద్రాబాద్ అమృతవాణి భవనంలో ఘనంగా క్రైస్తవ ఐక్యత సమావేశం

Secunderabad: సికింద్రాబాద్‌లో క్రైస్తవ ఐక్యత సమావేశం నిర్వహించారు. క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ, ఎస్ఆర్సీఏ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Srikanth, Secunderabad
Published on: 10 Oct 2026 8:38 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ అమృతవాణి భవనంలో ఘనంగా క్రైస్తవ ఐక్యత సమావేశం

సికింద్రాబాద్: సికింద్రాబాద్లోని అమృతవాణి భవనంలో నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్, గ్లోబల్ పీస్ ప్రేయర్ సంయుక్త ఆధ్వర్యంలో క్రైస్తవ ఐక్యత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ క్రైస్తవులందరూ ఒకే తాటిపై వచ్చి తమపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు.

మత పరమైన స్వేచ్ఛను హరిస్తూ తీసుకుని వస్తున్న ఎస్ఆర్సీఏ చట్టాన్ని ఉప సంహరిచుకోవాలని పగడాల ప్రవీణ్ మరణంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, క్రైస్తవులపై దాడులు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ తెలంగాణ అధ్యక్షులు సంజయ్ ఆనంద్ మాట్లాడుతూ ఇకపై క్రైస్తవులపై ఎలాంటి దాడులు జరిగినే చూస్తూ ఊరుకోమని అలాంటి వారికి చట్టపరమైన శిక్ష పడేంత వరకు పోరాడతామన్నారు.

క్రైస్తవులకు క్రిష్టియన్ భవన్ నిర్మించాలని, ఇమామ్లకు ఇచ్చినట్లు పాస్టర్లకు గౌరవ వేతనం అందించాలని, క్రైస్తవులపై దాడులు జరుగకుండా అలా చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చట్టాలను తయారు చేయాలన్నారు. గతంలో విద్య, వైద్యం అందించి సేవలు చేసిన అనేక క్రైస్తవ మిషనరీలకు విదేశాల నుంచి వచ్చే నిధులను రాకుండా 20వేల ఎఫ్ఆర్ సిఏ ఆర్సీఏ లైసెన్సులను రద్దు చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జీపీపీ వ్యవస్థాపకులు ప్రభు కిరణ్, పాస్టర్ ఏలియా, క్రిష్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్. దీపక్ జాన్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad