Hayathnagar: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Hayathnagar: హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం మరియు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

AJAY, HAYATH NAGAR
Published on: 14 Nov 2026 5:21 PM IST
Hayathnagar
X

Hayathnagar: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు!

Hayathnagar: నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హయత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలతో పాటు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు వివిధ హోదాల్లో అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా, ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఒకరోజు పాటు పాఠశాల బాధ్యతలను స్వీకరించి, పాఠశాల నిర్వహణలో తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ నాయకత్వ లక్షణాలను, పరిపాలనా నైపుణ్యాలను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి. రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR