Kadthal: కడ్తాల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. నివాళులర్పించిన నాయకులు!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
Kadthal: కడ్తాల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.. నివాళులర్పించిన నాయకులు!
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నేటి బాలలే రేపటి పౌరులన్న భారతదేశ మొట్ట మొదటి ప్రధాని పండిట్ జవహార్ లాల్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, సర్పంచ్ రాయికంటి బిక్షపతి అన్నారు.
శనివారం మండల కేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పండిట్ జవహార లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నెహ్రూ చిత్ర పటానికి ఉపాధ్యాయులు,
విద్యార్థులు, నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బాలల గ్రామసభ సమావేశంలో వారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని, వారికి విద్య, సంరక్షణతో పాటు, వారి హక్కులను కాపాడేందుకు సమిష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు.
చిన్నారులు తమ తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయులపై గౌరవ భావం అలవర్చుకోవాలని సూచించారు. చిన్నారులను సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. అదే విధంగా పలు పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి, వార్డు సభ్యులు భానుకిరణ్, నాయకులు ఛందోజి, సత్యం, తదితరులు వున్నారు.




