Chevella: చేవెళ్లలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
Chevella: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో కారులో అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
Chevella: చేవెళ్లలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
చేవెళ్ల: చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరా కాలేజీ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అందిన విశ్వసనీయ సమాచారం మేరకు AP 39 WW 6222 రిజిస్ట్రేషన్ నంబర్ గల కారును తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 22 కేజీల గంజాయి పట్టుబడింది.
ఈ సందర్భంగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులైన నక్క నారాయణ, తండ్రి వెంకటేశ్వరరావు, వయస్సు 30 సంవత్సరాలు, వృత్తి డ్రైవర్ మరియు రాణిమేకల నాగరాజు, తండ్రి నరసింహారావు, వయస్సు 29 సంవత్సరాలు, ఇద్దరూ గన్నవరం గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితులు విజయవాడ నుండి మహారాష్ట్ర రాష్ట్రానికి గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. కాగా, ప్రధాన నిందితుడైన నక్క నారాయణపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని డొంకరాయి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైనట్లు గుర్తించారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని, గంజాయి ఎక్కడినుండి తీసుకొని వస్తున్నారు ఎక్కడికి రవాణా చేస్తున్నారు మరియు ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నాము. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం మరియు వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని చెవెళ్ల పోలీసులు కోరారు.




