Shabad: షాబాద్ మండలంలో చేయూత పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Shabad: షాబాద్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య, అనంతరం చేయూత పెన్షన్లు, 20 మందికి రూ.9.06 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
Shabad: షాబాద్ మండలంలో చేయూత పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
చేవెళ్ల: షాబాద్ మండలంలో చేయూత పెన్షన్ల పంపిణీ, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత – చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య. షాబాద్ మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
అనంతరం షాబాద్ మండలంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన రూ.9,06,000 విలువైన చెక్కులను 20 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలే యాదయ్య అందజేశారు.
అలాగే షాబాద్ మండలంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




