Rangareddy: చేవెళ్ల సమీపంలో ఆర్మీ బండి బోల్తా – జవాన్లకు తీవ్ర గాయాలు

Rangareddy: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ వద్ద ఆర్మీ ట్రైనర్ వెహికల్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన జవాన్లను గోల్కొండ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 13 Nov 2026 1:44 PM IST
Rangareddy
X

Rangareddy: చేవెళ్ల సమీపంలో ఆర్మీ బండి బోల్తా – జవాన్లకు తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలంలోని అల్లా వాడ గేట్ సమీపంలో ఆర్మీ బండి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆర్మీ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 14 మంది ప్రయాణి స్తున్న ఎనిమిది మందికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

ఆర్మీ ట్రైనింగ్ లో భాగంగా గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి షాబాద్ మండలంలోని ట్రైనింగ్ పర్పస్ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ట్రైనర్ బండి నడిపిస్తున్న క్రమంలో అదుపుతప్పి పల్టీలు కొట్టి యధావిధి స్థానంలో చెట్టుకు తగిలి యధావిధిగా ఆగిన ఆర్మీ వెహికల్. వెంటనే వారిని గోల్కొండ ఆర్మీ హాస్పిటల్కి అంబులెన్స్ లో తరలించారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA