Cherlapally: చర్లపల్లిలో ఘనంగా కార్మికుల బతుకమ్మ వేడుకలు!

Cherlapally: చర్లపల్లి పారిశ్రామికవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల బతుకమ్మ సంబరాలు జరిగాయి.

ASHOK, KAPRA
Published on: 15 Oct 2026 7:52 PM IST
Cherlapally
X

Cherlapally: చర్లపల్లిలో ఘనంగా కార్మికుల బతుకమ్మ వేడుకలు!

చర్లపల్లి: చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున సాంప్రదాయం పద్ధతిలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు.

ముఖ్యంగా మహిళలు తొమ్మిది రోజులపాటు వివిధ రూపాలలో పేర్లతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సంతోషంగా నిర్వహిస్తారని అన్నారు. పూలను పూజించే సమాజం ఆడపిల్ల పుట్టినప్పుడు వివక్ష చూపడం బాధాకరమని అన్నారు. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం వస్తుందని అన్నారు. అందుకే ఆడపిల్లను పుట్టనిద్దాం బ్రతకనిద్దాం ఎదగనిద్దాం అని అన్నారు.

మహిళా హక్కులకై మహిళల వేధింపులపై పని ప్రదేశంలో లైంగిక హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని అన్నారు. మహిళలకు సమాజంలో సమాన హక్కులు కల్పించాలని వివక్షలేని సమాజం నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు బివి సత్యనారాయణ జి శ్రీనివాసులు జిల్లా కోశాధికారి పి గణేష్, మేడ్చల్ జిల్లా ఆశ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి రేవతి, వివిధ యూనియన్ల ప్రధాన కార్యదర్శిలు ఎస్ ఎస్ మణికంఠ టి నరసింహ కే బాలరాజు, టి రవీందర్ రెడ్డి, ఆదామ్, సంతోష్, శ్రీనివాస్, రాంబాబు, మన్మధరావు, చారి, సుబ్రహ్మణ్యం, నరసమ్మ మరియమ్మ,లావణ్య, మోక్ష,లక్ష్మి, పద్మ, అనిత విజయ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA