Chandrapuri: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Chandrapuri: చంద్రపురి కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన శ్రీకాంత్ యాదవ్. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వెల్లడి.

PURENDAR, ALWAL
Published on: 8 Nov 2026 3:34 PM IST
Chandrapuri
X

Chandrapuri: ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

చంద్రపురి: చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను స్థానిక నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. టపాకులు పేల్చి కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు వ్యక్తపరిచారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , జిల్లా అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు చంద్రపురి కాలనీ డివిజన్ శాంతి నగర్ లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసి లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలను నిర్వహించి వారి సంతోషాన్ని పంచుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ... ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా ఉంచాలని ఆకాంక్షించారు. డివిజన్ పరిధిలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, కార్పొరేటర్లు గొడుగు వేణు, బింగి సతీష్ గౌడ్, ఉపాధ్యక్షులు చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి బూడిద వెంకటేష్, జోగి సునీత, మాధవరెడ్డి, కోశాధికారి అశోక్ గుప్తా, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాహుల్ కదం,మైనార్టీ అధ్యక్షులు ఎండి గౌస్ , సీనియర్ నాయకులు గోపాల్, మందుల రజిత, లత,కారింగుల రాజు గౌడ్, కాలేశా,నర్సింగరావు ముదిరాజ్ , యాదగిరి యాదవ్,నాయకులు సాయి కృష్ణ (మిట్టు), భాస్కర్ గౌడ్, బబ్లూ ముదిరాజ్,రామ్ రెడ్డి, రమేష్ చారి, నాగరాజు, దోయ శ్రీనివాస్, ప్రభు గౌడ్, మంజుల, నర్సింగ్ ముదిరాజ్, రాములమ్మ, షర్మిల, బూడిద శ్రీనివాస్, రామచందర్, ఉపేందర్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL