Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ!
Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకల సందర్భంగా ఆమె నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.
Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ!
Secunderabad: చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా బోయిన్‌పల్లిలో ఘనంగా నివాళులు అర్పించారు.బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి తన సొంత నిధులతో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రజక అభివృద్ధి సేవా సంఘం, బోయిన్‌పల్లి ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జక్కుల మహేశ్వర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ తరం యువతకు ఆమె స్ఫూర్తిదాయకమని, ఆమె ఒక గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు. నేటి తరానికి ఆమె చేసిన సేవలను తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, బోయిన్‌పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్, రజక అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు K. రమేష్, ఉపాధ్యక్షులు G. కమలమ్మ, K.G. రమేష్, ప్రధాన కార్యదర్శి K. రాజు, సంఘం సభ్యులు K. వీర కుమార్, కిషోర్ కుమార్, O. ఏలేష్, A. నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.




