Jawaharnagar: జవహర్‌నగర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Jawaharnagar: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు.

PURENDAR, ALWAL
Published on: 26 Sept 2026 6:28 PM IST
Jawaharnagar
X

Jawaharnagar: జవహర్‌నగర్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!

Jawaharnagar: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ జవహర్‌నగర్ డివిజన్ పరిధిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె ధైర్యసాహసాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్లి శ్రీనివాస్, మాట్ల వినయ్ కుమార్, బల్లి శ్రీధర్, పొలాస కిరణ్, నాయకం భాస్కర్‌తో పాటు కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL