Kapra: ఈసీఐఎల్ చౌరస్తాలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
Kapra: ఈసీఐఎల్ చౌరస్తాలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు. హాజరై నివాళులర్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, భేతి సుభాష్ రెడ్డి.
Kapra: ఈసీఐఎల్ చౌరస్తాలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు!
Kapra: తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో ప్రజల్లో చైతన్యం రగిలించిన వీరనారి చాకలి ఐలమ్మ 131 జయంతి వేడుకలను తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,, మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు భేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణికగా ఐలమ్మ నిలిచారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం సాగించిన పోరాటం నేటి తరానికి సైతం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు అన్నారు.
సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటాన్ని స్మరించుకోవడంతో పాటు, ఆమె స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్లు ప్రభుదాస్, , పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి శివ పాండాల శివకుమార్ , సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ఎస్ బోస్ జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ రెడ్డి ధర్మేంద్ర, సత్య ప్రసాద్ నరసింహ కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్, యాదగిరిరావు శ్రీనివాస్ సత్యం కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మెరుగు చంద్రమోహన్, నాయకులు కొత్త అంజిరెడ్డి, కాసం మహిపాల్ రెడ్డి, యాదగిరిరావు, మర్రి మోహన్ రెడ్డి, , కృష్ణారెడ్డి, శ్రీకాంత్, ఏనుగు సీతారాంరెడ్డి, నీరుకొండ సతీష్ బాబు వెంకట్ ఎస్ఎ. రహీం, జయరాం, యాకయ్య, , కాప్రా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు యావపురం రవి, సలహాదారులు బిలిదే అశోక్, సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, వెంకట్ లీలావతి శ్రీనివాస్, సత్యం, రవి, తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శనిగరం అశోక్, రాష్ట్ర అధ్యక్షులు ముంజంపల్లి రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు సోమయ్య , రాష్ట్ర కార్యదర్శి సకినాల రవి, రాష్ట్ర కోశాధికారి జంజీరాల సత్యనారాయణ, రత్నాల కనకయ్య, కర్ణాకర్, కొమురయ్య, నరేష్ సాయి లింగన్న , యాకయ్య, యాకయ్య, కుమార్ స్వామి రాజిరెడ్డి రాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




