Shabad: షాబాద్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 26 Sept 2026 1:23 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు!

Shabad: వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను షాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

చాకలి ఐలమ్మ అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత అని వక్తలు కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్, డిప్యూటీ సర్పంచ్ దండు రాహుల్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA