Hyderabad: చెడ్డీ గ్యాంగ్ కలకలం - మహిళపై దాడి చేసి బంగారు నగలు దోపిడీ!

Hyderabad: నార్సింగి పీఎస్ పరిధిలోని నెక్నాంపూర్ ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్‌లో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం. అడ్డుకున్న మహిళపై వేటకత్తులతో దాడి చేసి నగదు, బంగారు ఆభరణాలు అపహరణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Sept 2026 12:44 PM IST
Hyderabad
X

Hyderabad: చెడ్డీ గ్యాంగ్ కలకలం - మహిళపై దాడి చేసి బంగారు నగలు దోపిడీ!

Hyderabad: హైదరాబాద్ నగరంలో ముఠా దొంగలు మళ్లీ హడలెత్తిస్తున్నారు. మణికొండ పరిధిలోని నెక్నాంపూర్ నార్సింగి పీఎస్‌ సరిహద్దుల్లో మోస్ట్ డేంజరస్ చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. తెల్లవారుజామున నెక్నాంపూర్ ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్ కాంపౌండ్ ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన ఆరుగురు సాయుధ దొంగల మూక తీవ్ర అలజడి సృష్టించింది.

అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్ తలుపులు బద్దలుగొట్టి లోపలికి జొరబడిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో దొంగతనాన్ని అడ్డుకునేందుకు ధైర్యంగా ప్రయత్నించిన ఓ మహిళపై ఆ ముఠా సభ్యులు వేటకత్తులు, మారకాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఆయుధాలతో బెదిరించి భయాందోళనకు గురిచేసి బాధితుల నుంచి బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని పారిపోయారు.

సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్ మరియు పరిసర ప్రాంతాల్లోని CCTV ఫుటేజ్‌లను నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్