Hyderabad: అక్టోబర్ 9 నుంచి 'సెలబ్రిటీ దాండియా నైట్స్' వేడుకలు!

Hyderabad: హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో అక్టోబర్ 9 నుంచి 20 వరకు 10వ సీజన్ సెలబ్రిటీ దాండియా నైట్స్ ఘనంగా నిర్వహణ.

RAJESH,	WEST ZONE
Published on: 7 Oct 2026 12:44 PM IST
Hyderabad
X

Hyderabad: అక్టోబర్ 9 నుంచి 'సెలబ్రిటీ దాండియా నైట్స్' వేడుకలు!

Hyderabad: అక్టోబర్ 9 నుంచి సెలబ్రిటీ దాండియా నైట్స్ హైదరాబాద్‌లో నవరాత్రి వేడుకలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మోడల్స్, రాఘవి మీడియా ఆధ్వర్యంలో 10వ సీజన్ సెలబ్రిటీ దాండియా నైట్స్ అక్టోబర్ 9 నుంచి 20 వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్‌లో జరగనుంది.

12 రోజుల పాటు దాండియా, గర్బా, లైవ్ బ్యాండ్స్, ఢోల్ తడ్కా, సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కార్యక్రమ పోస్టర్‌ను నిర్వాహకులు వంశీ పల్లె, మధుబాబు, నటి సాయి కీర్తన స్వర్గం, యాంకర్ వైష్ణవి తదితరులు ఆవిష్కరించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE