Uppal: హైదరాబాద్ ఉప్పల్లో సీబీఎస్ ఐదో ఎన్ఎఫ్టీ సదస్సు
Uppal: హైదరాబాద్ ఉప్పల్లో సీబీఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో 5వ ‘నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్’ సదస్సు జరిగింది; 10 రాష్ట్రాల వర్సిటీలు, 1,500 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Uppal: హైదరాబాద్ ఉప్పల్లో సీబీఎస్ ఐదో ఎన్ఎఫ్టీ సదస్సు
ఉప్పల్: విద్యార్థులకు ఉన్నత విద్య, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడంతోపాటు సరైన కెరీర్ ఎంపికకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంతో సీబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నిర్వహిస్తున్న ‘నర్చరింగ్ ఫ్యూచర్ టాలెంట్’ (ఎన్ఎఫ్టీ) ఐదో ఎడిషన్ హైదరాబాద్ ఉప్పల్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి 10 రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ప్రాతినిధ్యం వహించగా.. 1,500 మందికి పైగా బీటెక్ ప్రవేశాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో అమృత విశ్వవిద్యాపీఠం, అమిటీ యూనివర్సిటీ, మాస్టర్స్ యూనియన్, యూపీఈఎస్, సీజీసీ, కావేరి, ఎన్ఎంఐఎంఎస్, అనురాగ్ యూనివర్సిటీ తదితర ప్రముఖ విద్యాసంస్థలు పాల్గొన్నాయి.
ఆయా సంస్థల ప్రతినిధులు విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, ప్రవేశ అవకాశాలు, ఉన్నత విద్యా మార్గాలు, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై వివరించారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, వివిధ విద్యాసంస్థల వివరాలను తెలుసుకునేందుకు ఈ వేదిక అవకాశం కల్పించింది.
17 రాష్ట్రాల్లో 400కు పైగా కార్యక్రమాలు
సీబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విద్యారంగంలో తన కార్యకలాపాలను విస్తరిస్తూ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 400కు పైగా విద్యా కార్యక్రమాలను నిర్వహించి ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులకు చేరువైంది. అదేవిధంగా 10 వేల మందికి పైగా విద్యావేత్తలను ఈ విద్యా వ్యవస్థతో అనుసంధానం చేసింది.
విద్యార్థులకు విద్యా అవకాశాలపై అవగాహన కల్పించడం, విద్యాసంస్థలకు తమ కోర్సులు, ప్రత్యేకతలను పరిచయం చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా విద్యారంగంలో కీలక అనుసంధాన వేదికగా ఎన్ఎఫ్టీ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతోంది. మారుతున్న విద్యా, ఉద్యోగ రంగాలకు అనుగుణంగా విద్యార్థులు తమ ఆసక్తి, లక్ష్యాలకు తగిన కోర్సులను ఎంచుకోవడం ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఉన్నత విద్యలో అందుబాటులోకి వస్తున్న కొత్త అవకాశాలు, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న కెరీర్ మార్గాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికలను సమర్థంగా రూపొందించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మరిన్ని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు భాగస్వాములై విద్యార్థులకు నాణ్యమైన విద్యా సమాచారం, కెరీర్ మార్గదర్శకత్వం అందించాలని సీబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆహ్వానించింది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా జ్ఞానాన్ని పంచుకోవడం, విద్యా సంస్థలతో అనుసంధానాన్ని పెంపొందించడం తమ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.




