Chaitanyapuri: చైతన్యపురిలో క్యాటరింగ్ వ్యాపారి అనుమానాస్పద మృతి!
Chaitanyapuri: చైతన్యపురిలో క్యాటరింగ్ వ్యాపారి అనుమానాస్పద మృతి బకాయిల కోసం వెళ్లి విగతజీవిగా మారిన రాధాకృష్ణమూర్తి జెడ్‌పీహెచ్ స్కూల్ సమీపంలో ఘటన, పోలీసుల కేసు నమోదు.
Chaitanyapuri: చైతన్యపురిలో క్యాటరింగ్ వ్యాపారి అనుమానాస్పద మృతి!
చైతన్యపురి: బకాయి డబ్బులు తీసుకురావడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్యాటరింగ్ వ్యాపారి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. మారుతీనగర్‌కు చెందిన పిసుపాటి రాధాకృష్ణమూర్తి (52) క్యాటరింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఈ నెల 27న మధ్యాహ్నం సుమారు 2 గంటలకు పని సంబంధిత బకాయిలు తీసుకురావడానికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్‌డ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు పని ప్రదేశంలో ఉన్నారని భావించారు.
28న ఉదయం సుమారు 8 గంటలకు ఓ గుర్తుతెలియని వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. జెడ్‌పీహెచ్ పాఠశాల సమీపంలో రాధాకృష్ణమూర్తి మద్యం సేవించి పడిపోయి ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలోపే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.
మృతిపై తమకు ఎలాంటి అనుమానం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు.. మృతికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




