Kanchanbagh: మయన్మార్ మహిళపై అత్యాచారం, నలుగురిపై కేసు నమోదు!

Kanchanbagh: కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మయన్మార్ మహిళపై దారుణానికి ఒడిగట్టిన భర్తతో పాటు మరో ముగ్గురు బంగ్లాదేశీయులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 27 Oct 2026 9:24 AM IST
Kanchanbagh
X

Kanchanbagh: మయన్మార్ మహిళపై అత్యాచారం, నలుగురిపై కేసు నమోదు!

Kanchanbagh: కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మయన్మార్ కు చెందిన మహిళను బంగ్లాదేశ్ ఫయజ్ కు చెందిన వ్యక్తి వివాహం చేసుకుని అక్రమంగా నగరానికి వచ్చి కాంచన్ బాగ్ పీఎస్ పరిధిలో నివాసముంటున్నాడు. మద్యానికి బానిసైన భర్త తన స్నేహితులతో బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడేలా ఒత్తిడి చేయసాగాడు.

ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు మేరకు కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో సహా మరో ముగ్గురిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులందరూ బంగ్లాదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కంచన్ బాగ్ పోలీసులు తెలిపారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA