Secunderabad: శేషాచల కాలనీ రేషన్ షాప్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ తనిఖీ
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శేషాచల కాలనీలోని రేషన్ షాప్‌ను ఎమ్మెల్యే శ్రీగణేష్ తనిఖీ చేసి, సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు.
Secunderabad: శేషాచల కాలనీ రేషన్ షాప్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ తనిఖీ
సికింద్రాబాద్: కంటోన్మెంట్ నియోజకవర్గంలో శేషాచల కాలనీలో ఉన్న రేషన్ షాప్‌ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ సరుకుల పంపిణీ విధానం, బియ్యం నాణ్యత, ఇతర నిత్యావసర సరుకుల గురించి అక్కడికి వచ్చిన లబ్ధిదారులతో, ముఖ్యంగా మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
బియ్యం నాణ్యత ఎలా ఉంది? రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారులు స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం, అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
గతంలో ఎదురైన ఇబ్బందులు తగ్గాయని, నాణ్యమైన సన్నబియ్యం అందడం ఎంతో ఉపయోగకరంగా ఉందని తమ అభిప్రాయాలను వెల్లడించారు.ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు.
రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సరుకులు సక్రమంగా అందేలా చూడాలని రేషన్ షాప్ డీలర్ కి సూచించారు.ప్రజలకు నాణ్యమైన రేషన్ సరుకులు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




