Pargi: పరిగిలో పోలీస్ అమరవీరుల కొవ్వొత్తుల ర్యాలీ!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో ఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో డిపో నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
Pargi: పరిగిలో పోలీస్ అమరవీరుల కొవ్వొత్తుల ర్యాలీ!
Pargi: ప్రజల రక్షణే లక్ష్యంగా.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా.. విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు వికారాబాద్ జిల్లా పరిగి లో ఘన నివాళులు అర్పించారు.
పరిగి పట్టణంలో ఎస్పీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పరిగి డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు విద్యార్థులు పాల్గొని పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లు ఎన్నో.. నేరాలను అరికట్టడం, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం వంటి బాధ్యతలను పోలీసులు నిరంతరం నిర్వర్తిస్తుంటారు.
ఈ క్రమంలో కొందరు పోలీసులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు.అలాంటి పోలీసు అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల ప్రశాంత జీవనం కోసం తమ జీవితాలను అంకితం చేసిన పోలీసులు.




