Hyderabad: ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి: టిడిఎస్‌ఎఫ్
Hyderabad: ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని, ఫెస్ట్ ప్రమాదం మరియు అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరపాలని ఓయూ రిజిస్ట్రార్‌కు టిడిఎస్‌ఎఫ్ విజ్ఞప్తి చేసింది.
Hyderabad: ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి: టిడిఎస్‌ఎఫ్
హైదరాబాద్: ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ టిడిఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేసింది. కళాశాలలో ప్రవేశాల అవకతవకలు, విద్యార్థుల భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
సంఘమం-2026 ఫెస్టివల్‌లో లైటింగ్ ప్లేట్లు విద్యార్థులపై పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మంది ఆసుపత్రి పాలయ్యారని వినతిపత్రంలో పేర్కొంది. 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల అడ్మిషన్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ కార్యక్రమంలో టిడిఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. విజయ్ నాయక్, ఏఐఎస్ఓ కన్వీనర్ రమేష్ నాయుడు, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




