LB Nagar: మ్యాట్రిమోని పరిచయంతో నాగోలు వ్యాపారికి రూ.12.75 లక్షల సైబర్ టోకరా!

LB Nagar: నాగోలు వ్యాపారికి మ్యాట్రిమోని వెబ్‌సైట్ పరిచయంతో సైబర్ టోకరా. బంగారంపై పెట్టుబడుల పేరుతో నమ్మించి రూ.12.75 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 26 Nov 2026 9:44 AM IST
LB Nagar
X

LB Nagar: మ్యాట్రిమోని పరిచయంతో నాగోలు వ్యాపారికి రూ.12.75 లక్షల సైబర్ టోకరా!

LB Nagar: మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయం పెంచుకుని ఓ వ్యాపారిని సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. పెళ్లి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బంగారంపై పెట్టుబడుల పేరుతో ఏకంగా రూ.12.75 లక్షలు కాజేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగోలుకు చెందిన వరప్రసాదదొడ్డి వ్యాపారి. ఫిబ్రవరిలో ఓ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో దీక్షా సింగిరెడ్డి పేరుతో ఉన్న ప్రొఫైల్‌ చూసి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. బంగారంపై పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతున్నానంటూ ఆమె నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లు చూపించింది. దీంతో ఆమె మాటలు నమ్మిన బాధితుడు సూచించిన గోల్డ్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో విడతలవారీగా రూ.12.75 లక్షలు పెట్టుబడి పెట్టాడు.

అనంతరం తన పెట్టుబడి సొమ్మును ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR