Tarnaka: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలి!

Tarnaka: పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని బీఆర్‌ఎస్‌వీ నాయకులు ఓయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.

HARISH, TARNAKA
Published on: 7 Nov 2026 1:00 PM IST
Tarnaka
X

Tarnaka: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలి!

Tarnaka: ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనున్న పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ) నాయకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివర్లో పోలీస్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ తదితర పోటీ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్‌ పేర్కొన్నారు. ఒకేసారి పలు పోటీ పరీక్షలు, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు, వారి సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల తేదీలను వాయిదా వేసి, అభ్యర్థులకు తగిన సమయం కల్పించాలని రిజిస్ట్రార్‌ను కోరినట్లు నాగారం ప్రశాంత్‌ తెలిపారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA