Kalwakurthy: హరీష్ రావును కలిసిన కల్వకుర్తి బీఆర్‌ఎస్‌వీ నాయకులు!
Kalwakurthy: మాజీ మంత్రి హరీష్ రావును గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి బీఆర్‌ఎస్‌వీ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో విద్యార్థి విభాగం బలోపేతంపై చర్చించారు.
Kalwakurthy: హరీష్ రావును కలిసిన కల్వకుర్తి బీఆర్‌ఎస్‌వీ నాయకులు!
కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతను ప్రోత్సహించాలని, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని నాయకులు చర్చించారు. యువతకు అన్ని విధాలుగా సహకరిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్యా సంస్థలకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని బీఆర్‌ఎస్‌వీ నాయకులు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా, నిజాయితీగా పనిచేసేలా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌వీ యువ నాయకుడు తరుణ్ రాథోడ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం న్యాయంగా, నిజాయితీగా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బీఆర్‌ఎస్‌వీ యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




