Hyderabad: నగరంలో తాగునీటి కష్టాలు కేపాసిటీ తగ్గించి ట్యాంకర్ల వ్యాపారమా!
Hyderabad: ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు భారీ ధర్నా నిర్వహించారు.
Hyderabad: నగరంలో తాగునీటి కష్టాలు కేపాసిటీ తగ్గించి ట్యాంకర్ల వ్యాపారమా!
హైదరాబాద్: ఎల్బీనగర్....జంట నగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు,మహిళలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తాగునీటి సరఫరాలో నెలకొన్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో దాదాపు రెండు నెలల నుంచి మంచినీటి సమస్య ఉందని చెప్పిన పట్టించుకోవడంలేదని తెలిపారు. అలాగే 750 ఎంజిడి అవసరముంటే 550 ఎంజీడి సరఫరా చేస్తున్నారన్నారు.మరి రోజుకు 12 వేల ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటన్న ఇట్టి ప్రభుత్వం పైపులైన్ ద్వారా సరఫరా చేయడం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది అని అన్నారు.
కావున మంచినీటి సరఫరా విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని తెలిపారు.లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు,సీనియర్ భారస నాయకులు,ఉద్యమకారులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




