Khairatabad: తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం.. పాల్గొన్న ఖైరతాబాద్ MGR!
Khairatabad: తెలంగాణ భవన్‌లో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి.
Khairatabad: తెలంగాణ భవన్‌లో రాజ్యాంగ దినోత్సవం.. పాల్గొన్న ఖైరతాబాద్ MGR!
Khairatabad: జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి (BRS) కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా MGR గారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి దేశాన్ని అందించాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు పునాది అని, అయితే నేడు కొందరు డబ్బుతో ఓట్లను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తున్నారని విమర్శించారు. ఓటుకు నోటు వంటి రాజకీయ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు ముఖ్యమంత్రులుగా చలామణి అవుతూ రాజకీయ డ్రామాలకు తెరలేపుతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఏఐ (AI) సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నేటి భారతదేశానికి రాజ్యాంగ అక్షరాస్యత (Constitutional Literacy) ఎంతో అవసరమని MGR పేర్కొన్నారు. రాజ్యాంగం కేవలం హక్కులను మాత్రమే కాకుండా, ప్రశ్నించే హక్కుతో పాటు పౌరులుగా మన బాధ్యతలను కూడా గుర్తుచేస్తుందని తెలిపారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని MGR పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రావుల విజయ్, నరసింహ, రామ్మూర్తి, హైమద్, సారంగపాణి, రోహిత్, ఆంజనేయులు, నాగరాజు, శ్రీకాంత్, శౌరి రాజ్, విశాల్, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.




