Parigi: ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా?: పరిగి బీఆర్ఎస్ నేతలు!

Parigi: కొడంగల్‌లో ఆశా వర్కర్ల సంఘం నేతల అరెస్టులను పరిగి మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

WAZID, PARIGI
Published on: 11 Oct 2026 6:59 PM IST
Parigi
X

Parigi: ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా?: పరిగి బీఆర్ఎస్ నేతలు!

PARGI: వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్‌లో ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం సమావేశానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషాలను పోలీసులు అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ అరెస్టులను పరిగి బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కొడంగల్, పరిగి ఎమ్మెల్యేలు వారిని పరామర్శించారు.ఆశా వర్కర్ల సమస్యలు, హక్కులపై చర్చించేందుకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేశామని, ఎలాంటి ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం లేదని స్పష్టం చేసినప్పటికీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి తరఫున గొంతెత్తుతున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని విమర్శించారు. సమావేశం నిర్వహించుకోవడం కూడా తప్పేనా? అంటూ ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు జాక్ రవికుమార్, మీదిగడ్డ శ్రీనివాస్, ఆంజనేయులు, శశాంక్ రెడ్డి, నరేష్ యాదవ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకుడు చైతన్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI