Nacharam: నాచారంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను మార్చాలని డిమాండ్!

Nacharam: నాచారంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ డిమాండ్.. అధికారుల తీరుపై ఆగ్రహం.

HARISH, TARNAKA
Published on: 24 Sept 2026 6:50 PM IST
Nacharam
X

Nacharam: నాచారంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను మార్చాలని డిమాండ్!

Nacharam: నాచారం ప్రధాన రహదారిపై జాన్సన్ గ్రామర్ స్కూల్‌కు వెళ్లే మలుపు వద్ద రాఘవేంద్రనగర్ కాలనీలోని ఓ భవనం మొదటి అంతస్తు బాల్కనీకి అత్యంత సమీపంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను వెంటనే మార్చాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు సాయిజెన్‌ శేఖర్‌ డిమాండ్‌ చేశారు. బాల్కనీకి ఆనుకుని ఉన్న విద్యుత్‌ వైర్లతో భవనంలో నివసించే వారితో పాటు రహదారిపై రాకపోకలు సాగించే ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.

సమస్యను పరిష్కరించాలని గత ఐదు నెలలుగా నాచారం విద్యుత్‌ శాఖ అధికారులకు పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని శేఖర్‌ పేర్కొన్నారు. వైర్లకు సేఫ్టీ పైపులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైతే యాంగిల్స్‌, సపోర్టులు ఏర్పాటు చేసి వాటిని సురక్షిత దూరానికి మార్చాలని కోరినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌ను పంపించి త్వరలో పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులపై ఉందని పేర్కొన్నారు.

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ వైర్లపై మరోసారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, వెంటనే పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఏఈ నాగరాజును కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సాయిజెన్‌ శేఖర్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో విట్టల్‌ యాదవ్‌, కట్ట బుచ్చన్న గౌడ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA