Mallapur: మల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత సాయి శ్రవణ్ రెడ్డిపై వరుస దాడులు!

Mallapur: మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నేత సాయి శ్రవణ్ రెడ్డిపై వరుస దాడులు జరుగుతున్నాయని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

HARISH, TARNAKA
Published on: 4 Oct 2026 4:18 PM IST
Mallapur
X

Mallapur: మల్లాపూర్‌లో బీఆర్ఎస్ నేత సాయి శ్రవణ్ రెడ్డిపై వరుస దాడులు!

Mallapur: మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సాయి శ్రవణ్ రెడ్డి తనపై వరుసగా జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. మల్లాపూర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. గత 15 రోజులుగా తాను వెళ్లే ప్రాంతాల్లో కొందరు అనుసరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అద్దాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘటనలకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు, ఆయన అనుచరులు, సూర్యచంద్ర యూత్ క్లబ్ సభ్యులే కారణమని ఆయన ఆరోపించారు.

ఈ విషయమై నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జరిగిన మూడు ఘటనలకు సంబంధించి మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని సాయి శ్రవణ్ రెడ్డి తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఘటనలపై రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఎల్ అండ్ ఓ డీజీ మహేష్ భగవత్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో తనకు ఎలాంటి ఇబ్బంది లేదా ప్రాణహాని జరిగినా అందుకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాధ్యత వహించాలని సాయి శ్రవణ్ రెడ్డి పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించి, దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA