Kadthal: కడ్తాల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్ నాయకురాలు డాక్టర్ విజిత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 19 Oct 2026 8:09 AM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో దసరా పండుగను పురస్కరించుకుని సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు తెలంగాణ ఉద్యమకారిణి, బిఆర్‌ఎస్ పార్టీ కల్వకుర్తి మాజీ ఇన్చార్జి డాక్టర్ విజిత రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కోలాటాలతో సందడి చేశారు. మహిళల ఆటపాటలతో కడ్తాల్‌లో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో అరుణ, సువర్ణ, హిమబిందు, మంజుల, సునీతతో పాటు పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY